ETV Bharat / state

సినీ నటుడు బ్రహ్మాజీ రాకతో.. వ్యవసాయ మార్కెట్లో సందడి - తెలంగాణ తాజా వార్తలు

Actor Brahmaji at Jammikunta Market : ఓ చిత్రం షూటింగ్‌ కోసం బ్రహ్మాజీ జమ్మికుంట మార్కెట్‌కు వచ్చారు. చిత్రీకరణకు సిద్ధమవుతున్న తరుణంలో, మార్కెట్‌ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. సినిమా షూటింగ్​కు అనుమతిలేదని అధికారులు చెప్పారు. దీంతో షూటింగ్ జరగకపోయినా, బ్రహ్మాజీ రావడంతో మార్కెట్​లో సందడి నెలకొంది.

Brahmaji Bustles in the Market
Brahmaji Bustles in the Market
author img

By

Published : Nov 25, 2022, 12:27 PM IST

సినీ నటుడు బ్రహ్మాజీ రాకతో.. వ్యవసాయ మార్కెట్లో సందడి

Actor Brahmaji at Jammikunta Market : కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో సినీ నటుడు బ్రహ్మాజీ బృందానికి నిరాశ ఎదురైంది. రైతుల సమస్యత నేపథ్యంలో తెరకెక్కుతున్న ఓ చిత్రం షూటింగ్‌ కోసం టీమ్‌తో కలిసి బ్రహ్మాజీ జమ్మికుంట మార్కెట్‌కు వచ్చారు. చిత్రీకరణకు సిద్ధమవుతున్న తరుణంలో, మార్కెట్‌ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు.

సినిమా షూటింగ్‌కు అనుమతిలేదని అధికారులు చెప్పటంతో.. ఇదే విషయాన్ని అక్కడి సిబ్బంది షూటింగ్‌కు వచ్చిన వారికి సమాచారమిచ్చారు. షూటింగ్‌ జరగకపోయినా, బ్రహ్మాజీ రావడంతో మార్కెట్‌లో సందడి వాతావరణం నెలకొంది. మార్కెట్‌లో తాను పత్తి అమ్మేందుకు వచ్చే సన్నివేశాన్ని చిత్రీకరించేందుకు ఇక్కడికి వచ్చినట్లు బ్రహ్మాజీ తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.