కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తనకు ఫోన్ చేసి బూతులు మాట్లాడారని ఓ వ్యక్తి ఆరోపించారు. బాధితుడు ఆడియో రికార్డులు బయటపెట్టడంతో ఈ సంఘటన వైరల్‌గా మారింది. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని బేగంపేటకు చెందిన రాజశేఖర్ మండలంలో నెలకొన్న పలు సమస్యలపై ప్రజల తరఫున నిలదీయడంతో ఎమ్మెల్యే వారం రోజుల నుంచి వాట్సాప్ కాల్‌లో దుర్భాషలాడుతూ... బెదిరింపులకు గురి చేస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. వాట్సాప్ కాల్ రికార్డింగ్ అనుకూలించకపోవడంతో ఏమి చేయలేక పోయానని... రెండు రోజుల నుంచి వాట్సాప్ కాల్ ఎత్తకపోవడం వల్ల ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడారని తెలిపారు.
ఆ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోకపోతే సీఎం క్యాంప్ ఆఫీస్ ఎదుట నిరాహార దీక్ష చేపడతానని తెలిపారు. మరోవైపు ఆడియోను ఎడిటింగ్ చేసి దళిత ఎమ్మెల్యే పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తి పై చర్యలు తీసుకోవాలని వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: అమెరికా డిమాండ్‌తో చైనా ఎగుమతుల్లో భారీ పెరుగుదల!