కరీంనగర్ జిల్లాలో కురిసిన అకాల వర్షానికి యార్డులో నిల్వ చేసిన రైతుల ధాన్యం తడిసి ముద్దయింది. ప్రతి గ్రామానికి ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సరిపడా టార్పాలిన్లు లేకపోవడం వల్ల ఆరుబయట నిల్వచేసిన ధాన్యం తడిసిపోయింది. గత వారం రోజులుగా తాలు సమస్యతో తూకం నిలిచిపోగా రైతుల సర్దుబాటుతో కొనుగోళ్లు మొదలయ్యాయి.
కానీ అకాల వర్షానికి ధాన్యం ముద్దవడం వల్ల రైతులు ఆవేదన చెందుతున్నారు. రామడుగు, గంగాధర తదితర మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు తడిసిన ధాన్యాన్ని ఎత్తుకునేందుకు అవస్థలు పడ్డారు.
ఇవీ చూడండి: లాక్డౌన్ కొనసాగించాలి: జగ్గారెడ్డి