ETV Bharat / state

Anganwadi Bills pending: అద్దె బిల్లు రూ.30 కోట్లు.. బకాయిలడిగితే బెదిరింపులు! - telangana latest news

Anganwadi Bills pending: రాష్ట్రంలో సుమారు 35 వేల 568 అంగన్​వాడీల్లో 12824 అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. 2021 ఏప్రిల్​ నుంచి సుమారు 30 కోట్ల రూపాయల అద్దె బకాయిలు పెండింగ్​లో ఉన్నాయి. దీంతో సంబందిత యజమానులు తమ భవనాలు ఖాళీచేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. ఇదే విషయం అధికారులకు చెబితే క్రమశిక్షణ అతిక్రమణ, విధుల్లో నిర్లక్ష్యం పేరిట మెమోలు జారీ చేస్తామని హెచ్చరించడంతో వెనక్కు తగ్గుతున్నామని పలువురు అంగన్​వాడీ సిబ్బంది చెబుతున్నారు.

Anganwadi Bills pending
Anganwadi Bills pending
author img

By

Published : Feb 21, 2022, 7:45 AM IST

Anganwadi Bills pending: రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలకు అద్దె కష్టాలు ఎదురయ్యాయి. నెలల తరబడి అద్దె నిధులు రాకపోవడంతో అంగన్‌వాడీ కేంద్రాలు కొనసాగుతున్న భవన యజమానులు ఖాళీ చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. బాలింతలు, గర్భిణులు, పిల్లలకు పౌష్టికాహారానికి ఆటంకం కలగకుండా కొంతమంది అంగన్‌వాడీ సిబ్బంది తమ వేతనాల నుంచి అద్దెలు చెల్లిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణకు అదనపు నిధులు ఇవ్వాలంటూ ఇప్పటికే ఆర్థికశాఖకు ప్రతిపాదనలు పంపినా నేటికీ ఆమోదం లభించలేదు. అద్దెల రూపంలోనే దాదాపు రూ.30 కోట్లు అవసరమని అంచనా.

  • రాష్ట్రంలో 35,568 అంగన్‌వాడీ కేంద్రాలుంటే 12,824 కేంద్రాలు అద్దెభవనాల్లో కొనసాగుతున్నాయి. వీటికి పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.3-4వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.వెయ్యి వరకు చెల్లిస్తున్నారు. గతంలో రెండు, మూడు నెలలకోసారి అద్దెనిధులు మంజూరు చేసినప్పటికీ రెండేళ్లుగా తీవ్రంగా జాప్యం జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కేంద్రాలకు 2021 ఏప్రిల్‌ నుంచి అద్దె బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి.
  • అద్దె నిధులు విడుదల చేయాలంటూ ఇటీవల నిజామాబాద్‌ అర్బన్‌ జిల్లాలో అంగన్‌వాడీ సిబ్బంది సీడీపీవో కార్యాలయం ముందు బైఠాయించారు. తమ వేతనాల నుంచి అద్దెలు చెల్లిస్తున్నామని, నిధులు విడుదల కాకపోవడంతో ఆర్థిక కష్టాలు తప్పడం లేదని వాపోయారు. ఉన్నతాధికారులు ఏదోలా సర్దిచెప్పడంతో ఆందోళన విరమించుకున్నారు.
  • కరీంనగర్‌ జిల్లాలో అద్దెభవనాల్లో 255 అంగన్‌వాడీ కేంద్రాలు ఉంటే, అక్కడ ఏడాదిగా అద్దె నిలిచిపోయింది.
  • జిల్లాల్లో అద్దెబకాయిలు వెంటనే విడుదల చేయాలని అంగన్‌వాడీ సిబ్బంది కోరితే క్రమశిక్షణ అతిక్రమణ, విధుల్లో నిర్లక్ష్యం పేరిట మెమోలు జారీ చేస్తామని హెచ్చరించడంతో వెనక్కు తగ్గుతున్నారు.

పాఠశాలల్లోకి బదిలీ...

అంగన్‌వాడీలను దగ్గర్లోని ప్రభుత్వ, పరిషత్‌ పాఠశాలలకు మార్చాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయించింది. అద్దెభవనాల్లో అంగన్‌వాడీ కేంద్రాలకు బదిలీల్లో తొలిప్రాధాన్యం ఇవ్వాలని ఇటీవల మంత్రి ఆధ్వర్యంలోని ఉన్నతస్థాయి కమిటీ సూచించింది. పాఠశాలలోనే ఒకగదిని అంగన్‌వాడీ కేంద్రానికి కేటాయించాలని తెలిపింది. ఒకేగదిలో వంట, పిల్లలకు ఆటపాటలు సాధ్యం కాదని, బాలింతలు, గర్భిణులు దూరంగా ఉన్న పాఠశాలలకు రాలేరని అంగన్‌వాడీ సిబ్బంది పేర్కొంటున్నారు. కేంద్రాలకు శాశ్వత భవనాలు నిర్మించి, ఆధునిక హంగులతో పిల్లలకు అవసరమైన పరికరాలు అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు.

  • ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు: 149
  • అంగన్‌వాడీ కేంద్రాలు: 35,568
  • సొంత భవనాలు: 22,744
  • అద్దె చెల్లిస్తున్నవి: 12,824
  • గర్భిణులు, బాలింతలు: 4 లక్షలు
  • ఆరేళ్లలోపు లబ్ధిదారులు: 14 లక్షలు

ఇదీచూడండి: రాష్ట్ర ప్రభుత్వం వల్లే రైల్వే పనుల్లో ఆలస్యం.. సీఎంకు కిషన్​రెడ్డి లేఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.