కరీంనగర్ జిల్లా ఘన్ముకులకు చెందిన బొంగోని మంగలక్ష్మికి పురినొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకి చేరుకున్న 108 సిబ్బంది మంగలక్ష్మిని కరీంనగర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే పురిటినొప్పులు ఎక్కవయ్యాయి. కిష్టంపేట సమీపంలో వాహనాన్ని పక్కకు ఆపి ప్రసవం నిర్వహించారు. మంగలక్ష్మి పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు క్షేమంగా ఆరోగ్యంగా ఉండగా వారిని చల్లూరు పీహెచ్సీలో ఉంచారు.
ఇవీ చూడండి: బ్యాంకుల జాతీయీకరణ స్వర్ణోత్సవాలు