పారిశుద్ధ్య నిర్వాహణ సక్రమంగా లేకపోవడంతో.. ఓ మహిళా వార్డు కౌన్సిలర్ పార పట్టారు. అధికారులను అభ్యర్థించినా.. సిబ్బందిని పంపకపోవడంతో, తానే స్వయంగా మురికి కాలువలను శుభ్రం చేశారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో ఈ ఘటన జరిగింది.
కాలువలు నిండుకోవడంతో గత కొద్ది రోజులుగా 9వ వార్డు ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దోమల ద్వారా.. వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి. అధికారులు, ఛైర్మన్లను అభ్యర్థించినా.. సిబ్బందిని పంపడం లేదు.
- వార్డు కౌన్సిలర్ విజయలక్ష్మి
ఇదీ చదవండి: బాలికపై హత్యాచారం- అడ్డొచ్చిన ఇద్దరు హత్య