ETV Bharat / state

ఎస్బీఐ ఖాతా నుంచి రూ.లక్షా 50 వేలు మాయం - DHARNA

ఆరుగాలం కష్టపడి సంపాదించిన డబ్బులను బ్యాంకులో దాచుకున్నాడు. ఏమైందో ఏమో తెలియదు కానీ పదిహేను రోజుల క్రితం ఖాతా నుంచి డబ్బులు మాయమయ్యాయి. ఇదేంటని అధికారలను అడిగితే స్పందన లేదు. ఏమి చేయాలో పాలుపోని బాధితుడు బ్యాంకు ముందు బైఠాయించాడు.

ఎస్బీఐ ఖాతా నుంచి రూ.లక్షా 50 వేలు మాయం
author img

By

Published : Sep 27, 2019, 5:58 PM IST

తన బ్యాంకు ఖాతా నుంచి డబ్బు మాయమైందని బాధితుడు బ్యాంకు ముందు నిరసన వ్యక్తం చేశాడు. కామారెడ్డి జిల్లా మద్నూర్​కు చెందిన నారాయణకు స్థానిక ఎస్బీఐ బ్యాంకులో ఖాతా ఉంది. పదిహేను రోజుల క్రితం తన ఖాతా నుంచి లక్షా 50 వేల రూపాయలు మాయమయ్యాయి. విషయం తెలుసుకున్న నారాయణ పోలీసులకు, బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేశాడు. అయినప్పటికీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదని బాధితుడు ఈ రోజు బ్యాంకు ముందు బైఠాయించాడు. తనకు న్యాయం చేయాలంటూ భార్యతో కలిసి పోరాటం చేస్తున్నాడు. బ్యాంకులో దాచుకున్న డబ్బులు ఎలా మాయమవుతాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఎస్బీఐ ఖాతా నుంచి రూ.లక్షా 50 వేలు మాయం

ఇవీ చూడండి: పాక్​ ఉగ్రమూకలను తరిమికొట్టిన భారత సైన్యం

File name: TG_NZB_04_27_NIRASANA_AV_TS10107 Srinivas Goud, Etv jukkal, kaama reddy zilla. Phone:9394450181, 9440880004 తన బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు మాయం కావడంతో బాధితుడు బ్యాంకు ముందు నిరసన వ్యక్తం చేశాడు. కామారెడ్డి జిల్లా మద్నూర్ కు చెందిన నారాయణకు స్థానిక ఎస్.బీ.ఐ బ్యాంకులో ఖాతా ఉంది. ఖాతా నుంచి గత 15 రోజుల క్రితం లక్ష 50వేల రూపాయలు మాయం కావడంతో బాధితుడు బ్యాంకు అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ ఇప్పటి వరకు అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదని బాధితులు వాపోయాడు. అధికారుల తీరుకు నిరసనగా బ్యాంకు ముందు ఆయన భార్య తో కలసి బైటాయించారు. బ్యాంకులో డబ్బులు దాచుకుంటే తనకు తెలియకుండా ఎలా మాయం అవుతాయి...? అని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకులో ఖాతాలో ఉన్న డబ్బుకు రక్షణ లేకుండా పోయిందని వాపోయాడు. స్పందించిన అధికారులు బాధితుడి వద్దకు వచ్చి ఖాతా నుంచి డబ్బులు పోయిన విషయంలో బ్యాంకు అధికారులకు ఎలాంటి సంబంధం లేదని ఏటీఎం జాగ్రత్తగా వాడుకోవాలని అని తెలియజేశారు. ఈ విషయంపై అధికారులకు, పోలీసులకు తెలియజేశామని విచారణ కొనసాగుతుందని పేర్కొన్నారు. కూలి పనులు చేసి బ్యాంక్ లో డబ్బులు జమ చేసుకున్నానని తనకు న్యాయం చేయాలని నారాయణ అధికారులకు వేడుకున్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.