ETV Bharat / state

ఎంతకష్టం: నాలుగు కిలోమీటర్లు... నెలకు రూ. 50

రాష్ట్రంలో ఎక్కడ చూసినా నీటి తిప్పలే కనిపిస్తున్నాయి. వర్షాకాలంలోనూ మంచినీటి కోసం మైళ్ల దూరం వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.

author img

By

Published : Jul 18, 2019, 1:23 PM IST

నాలుగు కిలోమీటర్లు... నెలకు రూ. 50

వర్షాకాలంలోనూ తాగునీటి కష్టాలు తప్పడం లేదని కామారెడ్డి జిల్లా మద్నూర్​ మండలం తడి హిప్పర్గ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి కోసం మైళ్ల దూరం వెళ్లాల్సి వచ్చినా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. పార్లమెంటు ఎన్నికలు బహిష్కరిస్తామంటే కొన్ని రోజులు సరఫరా చేసి చేతులు దులుపుకున్నారని తెలిపారు. తాగునీటి కోసం 4కిలోమీటర్ల దూరం వెళ్లి వ్యవసాయ బోరు యజమానికి నెలకు 50 రూపాయలు చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తుందన్నారు.

నాలుగు కిలోమీటర్లు... నెలకు రూ. 50

ఇదీ చూడండి: 'దూకితే మోదీ స్కార్పియో ఇస్తానన్నాడు'

Intro:వర్షాకాలంలోనూ తాగునీటి తిప్పలు తప్పడం లేదు. నీళ్ల కోసం మైళ్ల దూరం వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఏళ్లుగా తాగునీటి ఇబ్బందులు పడుతున్న ఎవరు పట్టించుకోవడం లేదని ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ ఎన్నికలు బహిష్కరిస్తామని హెచ్చరిస్తే నెలరోజులు నీళ్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం గ్రామం తడి హిప్పర్గ. గ్రామంలో బోర్లు ఉన్న తాగేందుకు ఉపయోగపడవు. నోట్లో పోసుకోలేనంతగా ఉప్పగా ఉంటాయి. దీంతో గ్రామస్తులు నాలుగు కిలోమీటర్ల దూరంలో సోనాల శివారులోని వ్యవసాయ బోరు నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే సైకిల్, ద్విచక్ర వాహనాలపై బోరు వద్దకు వెళ్తున్నారు. బోరు యజమాని కి నెలకు 50 రూపాయలు చెల్లించి నీళ్లు కొనుగోలు చేస్తున్నారు. తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న ఎవరు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

Body:శ్రీనివాస్ గౌడ్, జుక్కల్, కామారెడ్డి జిల్లా

Conclusion:ఈటీవీ భారత్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.