కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సలబత్ పూర్ మహారాష్ట్ర సరిహద్దు వద్ద తెలంగాణ, మహారాష్ట్ర పోలీసుల మాటల యుద్ధం చోటు చేసుకుంది. తెలంగాణ నుంచి మహారాష్ట్ర లోకి ఎందుకు వాహనాలను పంపిస్తున్నారని అక్కడి పోలీసులు సరిహద్దు వద్దకు వచ్చి వాగ్వాదానికి దిగారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ నుంచి వచ్చే వాహనాలను అనుమతించబోయేది లేదని తెగేసి చెప్పారు.
సరిహద్దు వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. గంట పాటు నిత్యావసర సరుకుల వాహనాలు నిలిచిపోయాయి. ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని నిత్యావసర సరుకుల వాహనాలను పంపించాలని వారు సూచించారు. దీంతో వివాదం సద్దుమణిగింది.
ఇదీ చూడండి: దిల్లీలో కరోనా కలకలం.. ఐసోలేషన్లో వందలాది మంది