ETV Bharat / state

కరోనా వైరస్ భయం.. తీసింది ప్రాణం - తెలంగాణ కరోనా వార్తలు

లక్షణాలు కనిపించడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. పరీక్షలు చేయించుకొన్న నాటి నుంచి ఆ మహమ్మారి సోకుతుందేమోనని భయాందోళనకు లోనయ్యాడు. చివరికి ఆందోళన చెందుతూనే గుండెపోటుతో మృతి చెందాడు. కరోనా పాజిటివ్‌ వచ్చిందన్న బెంగతో ఓ గర్భిణి కూడా మరణించింది. వైరస్ సోకినా కరోనాను జయించవచ్చని వైద్యులు చెబుతున్నా... అనవసరమైన ఆందోళన చెంది మృత్యువాత పడుతున్నారు.

coronavirus
coronavirus
author img

By

Published : Jul 20, 2020, 11:19 AM IST

జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న కామారెడ్డి జిల్లా బీర్కూర్‌కు చెందిన ఓ వ్యక్తి(68) శుక్రవారం బాన్సువాడ ప్రాంతీయ ఆసుపత్రిలో కొవిడ్‌ పరీక్షలు చేయించుకొన్నాడు. నమూనాలు ఇచ్చిన తర్వాత.. తనకు కరోనా సోకుతుందేమోనని భయంగా ఉందంటూ కుటుంబసభ్యుల ముందు వాపోయాడు.

ఈ క్రమంలో శనివారం రాత్రి 7:30 గంటలకు గుండెపోటు వచ్చింది. చికిత్స కోసం తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. అంతకుముందే కరోనా పరీక్షలు చేయించుకోవడంతో అంత్యక్రియలు చేయడం కోసం.. ఆయనకు పాజిటివ్‌ ఉందా, నెగిటివ్‌ వచ్చిందా అన్న అనుమానంతో కుటుంబసభ్యులు వైద్యులను సంప్రదించారు.

అంత్యక్రియలు అయిన పది నిమిషాలకు ఫలితం

ఫలితం రానిదే తామేం చెప్పలేమని వైద్యులు తెలిపారు. ఆదివారం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయగా.. పదుల సంఖ్యలో జనం వచ్చారు. విషయం తెలుసుకొన్న పోలీసులు అక్కడికి చేరుకోగానే చాలా మంది ఇళ్లకు వెళ్లిపోయారు. చివరకు శ్మశానవాటిక వద్ద 15 మందితో దహన సంస్కారాలు పూర్తి చేశారు. అంత్యక్రియలు పూర్తయిన పది నిమిషాలకు కరోనా పాజిటివ్‌ అని ఫలితం వచ్చింది.

మహమ్మారి వచ్చిందని గర్భిణి మృతి

మరో వారం పది రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వాల్సిన గర్భిణి కరోనా పాజిటివ్‌ వచ్చిందన్న బెంగతో మృత్యువాత పడింది. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన 34 ఏళ్ల యువతికి ప్రస్తుతం తొమ్మిదో నెల. నాలుగు రోజుల క్రితం బీపీ ఎక్కువైనట్లు గుర్తించిన ఆమె భర్త హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. వైద్యులు మందులు ఇవ్వడంతో బీపీ సాధారణ స్థాయికి వచ్చింది.

మరో 10 రోజుల్లో ప్రసవం చేస్తామని, పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కొవిడ్‌-19 పరీక్ష చేయించగా పాజిటివ్‌గా తేలింది. ఆదివారం ఈ విషయం తెలియడంతో ఆమె ఒక్కసారిగా కుప్పకూలింది. గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. బాధిత కుటుంబ సభ్యులను గృహ నిర్బంధంలో ఉండాలని సూచించినట్లు కొమురవెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు కార్తీక్‌ తెలిపారు.

ఇదీ చదవండి: నరకయాతన: అద్దె ఇళ్లలో ఉండనివ్వరు.. దవాఖానాల్లో చేర్చుకోరు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.