ETV Bharat / state

ఆదాయంపై ఆర్టీసీ దృష్టి... 92 పెట్రోల్‌ బంకుల ఏర్పాటుకు నిర్ణయం

ఆర్టీసీ తన ఆదాయ వనరులను పెంచుకునే క్రమంలో 92 పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వాహనదారులకు నాణ్యమైన పెట్రోల్ అందించేందుకు ఇవి దోహదపడతాయని సంస్థ అభిప్రాయపడుతోంది. కమీషన్ ప్రాతిపదికన వీటిని నడపనున్నారు.

TSRTC
TSRTC
author img

By

Published : Aug 20, 2020, 8:37 AM IST

ఆర్టీసీ టికెటేతర ఆదాయంపై దృష్టిసారించింది. ఇప్పటికే కార్గో, పార్శిల్, కొరియర్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా బీర్కూర్, బిచ్కుంద ప్రజలకు ఆర్టీసీ పెట్రోల్ బంకులను అందుబాటులోకి తీసుకుని వచ్చినట్లు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రకటించారు. ఆర్టీసీ తన ఆదాయ వనరులను పెంచుకునే క్రమంలో హెచ్‌పీసీఎల్‌, ఐఓసీఎల్ సంస్థల ద్వారా దీర్ఘకాలిక ఒప్పందంలో భాగంగా 92 పెట్రోలు బంకులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వాహనదారులకు నాణ్యమైన పెట్రోల్ అందించేందుకు ఇవి దోహదపడతాయని సంస్థ అభిప్రాయపడుతోంది. కమీషన్ ప్రాతిపదికన వీటిని నడుపనున్నారు.

పెట్రోల్ బంకుల నిర్వహణ కోసం గ్రేటర్ హైదరాబాద్ జోన్, హైదరాబాద్ జోన్, కరీంనగర్ జోన్ వారీగా సర్వీసు ప్రొవైడర్లను కార్పొరేషన్ నియమించింది. కానీ కరీంనగర్ జోన్ కాంట్రాక్టర్ తన కాంట్రాక్ట్ ను రద్దు చేసుకోవడంతో మిగులు సిబ్బందితో వాటి నిర్వహణను ఆర్టీసీ తన చేతిలోకి తీసుకుంది. మొదటగా జనగామ, ఆ తర్వాత బీర్కూరు, బిచ్కుంద, ఆసిఫాబాద్, హన్మకొండ, మహబూబాబాద్ ప్రాంతాల్లో పెట్రోలు బంకులను సంస్థ తన అధీనంలోకి తీసుకోనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.