ETV Bharat / state

కామారెడ్డి కలెక్టరేట్​ ఎదుట కార్మిక సంఘాల నిరసన - kamareddy district news

కామారెడ్డి కలెక్టరేట్​ ఎదుట కార్మిక సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. లాక్​డౌన్​ కాలానికి సంబంధించిన పూర్తి వేతనాలు కార్మికులకు చెల్లించాలని డిమాండ్​ చేశారు. పెరిగిన పెట్రోల్​, డీజిల్​ ధరలను తగ్గించాలని, కరోనా నియంత్రణ కోసం ప్రజారోగ్య వ్యవస్థను పటిష్టం చేయాాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.

trade unions protest in front of kamareddy collectorate
కామారెడ్డి కలెక్టరేట్​ ఎదుట కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన
author img

By

Published : Jul 4, 2020, 2:35 PM IST

దేశవ్యాప్త నిరసనలో భాగంగా కామారెడ్డి కలెక్టరేట్​ ఎదుట ఏఐటీయూసీ, సీఐటీయూ, ఏఐఎఫ్​టీయూ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. దేశంలో, రాష్ట్రంలో కార్మికులకు ఎటువంటి న్యాయం జరగడం లేదని కార్మికుల సంఘాల నాయకులు అన్నారు. లాక్​డౌన్​ కాలానికి సంబంధించిన పూర్తి వేతనాలు కార్మికులకు చెల్లించాలని డిమాండ్​ చేశారు. అలాగే ప్రతి కార్మిక కుటుంబానికి, పేద కుటుంబాలకు నెలకు 7,500 రూపాయల చొప్పున 3 నెలల పాటు ఇవ్వాలని అన్నారు. కార్మిక చట్టాల సవరణలను ఆపాలని వారు డిమాండ్ చేశారు.

బొగ్గు గనులను ప్రైవేట్ వ్యక్తులకు వేలం వేయడం ఆపాలన్నారు. బొగ్గు, రక్షణ, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, రైల్వే ఫార్మా రంగాల్లో ఎఫ్​డీఐలను నిలిపి వేయాలని పేర్కొన్నారు. కరోనా వైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వం ప్రజారోగ్య వ్యవస్థను పటిష్టం చేయాలని కోరారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు ఎల్.దశరథ్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు నాగన్న, ఏఐఎఫ్​టీయూ రాష్ట్ర అధ్యక్షురాలు అనసూయ పాల్గొన్నారు.

ఇవీ చూడండి: కంటోన్మెంట్​లోనూ ప్రభుత్వ పథకాల అమలు: తలసాని, మల్లారెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.