ETV Bharat / state

Revanth Reddy: 'రైతుల పంటలు కొనకుంటే కేసీఆర్ ఫామ్‌హౌస్‌ను ముట్టడిస్తాం' - ts news

Revanth Reddy : రాష్ట్ర ప్రభుత్వం చివరి ధాన్యపు గింజ కొనేవరకు పోరాటం చేస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఏప్రిల్‌ నెల నుంచే ముఖ్యమంత్రి ధాన్యం కొనేందుకు ఏర్పాట్లు చేయకుంటే రైతులతో కలిసి ఫామ్‌హౌస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఓట్లు వేసి రెండుసార్లు అధికారాన్ని కట్టపెడితే కేంద్రంపై నెపం మోపి.. దిల్లీ వెళ్లి పోరాడుతానని ఊకదంపుడు ఉపన్యాసాలిస్తున్నారని మండిపడ్డారు.

Revanth Reddy Comments: 'రైతుల పంటలు కొనకుంటే కేసీఆర్ ఫామ్‌హౌస్‌ను ముట్టడిస్తాం'

author img

By

Published : Mar 20, 2022, 8:38 PM IST

Updated : Mar 20, 2022, 10:50 PM IST

'రైతుల పంటలు కొనకుంటే కేసీఆర్ ఫామ్‌హౌస్‌ను ముట్టడిస్తాం'

Revanth Reddy : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ 'మన ఊరు- మన పోరు' బహిరంగ సభలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. చెరకు ఫ్యాక్టరీలు తెరుస్తామని హామీ ఇచ్చిన కవిత... ఎంపీగా గెలవగానే ఆ విషయాన్ని మర్చిపోయారని రేవంత్​ విమర్శించారు. పసుపు బోర్డు తెస్తానని బాండ్‌పేపర్‌పై రాసిచ్చిన భాజపా ఎంపీ అర్వింద్‌ హామీని తుంగలో తొక్కారని మండిపడ్డారు. పసుపు బోర్డు రాక పసుపు రైతులు, గిట్టుబాటు ధర లేక ఎర్రజొన్న రైతులు, వరి వేయొద్దన్న కేసీఆర్‌ ప్రకటనలతో నిజామాబాద్‌ జిల్లా పడావుగా మారే పరిస్థితి ఉందని ఆరోపించారు. 2లక్షల కోట్ల బడ్జెట్‌ ఉన్న తెలంగాణలో 10వేల కోట్లు పెట్టి అన్నదాతలు పండించిన ధాన్యాన్ని కొనలేరా? అని ప్రశ్నించారు. నెపాన్ని కేంద్రంపై నెట్టి మరోసారి దిల్లీపై అగ్గిపుట్టిస్తానని బయలుదేరుతున్నారని మండిపడ్డారు.

మరి రైతులు ఏమవ్వాలి..

'వరి పండించిన రైతులను మోసం చేస్తే ఎల్లారెడ్డి నడిబజార్లో ఉరితీస్తాం. ఇక్కడ రైతులను చూస్తే పంజాబ్, హరియాణా రైతుల్లాగా పోరాట స్ఫూర్తి కనిపిస్తోంది. మూడు నల్ల వ్యవసాయ చట్టాలు తెస్తే పంజాబ్, హరియాణా రైతులు పోరాటం చేసి ఆ చట్టాలను బొంద పెట్టారు. కేసీఆర్ ముద్దుల కూతురు కవిత ఇక్కడ ఎంపీగా పోటీ చేసిన సమయంలో వంద రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తా అన్నది. కానీ 1500 రోజులు అయిన తెరవకపోవడంతో ఆమెను ఎలా ఓడించారో..మీకే తెలుసు. అర్వింద్​ ఇలాగే పసుపు బోర్డు తెస్తా అన్నాడు అడ్రెస్ లేదు.. ఆయన మోసం చేశాడు. ఎర్ర జొన్నలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తా అని కేసీఆర్ మోసం చేశారు. ఇప్పుడు కేసీఆర్ వరి వేయొద్దు అంటున్నారు.. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కోటి ఎకరాల భూమికి నీళ్లు ఇస్తా అంటున్నావు. మరి నీళ్లు, ఉచిత కరెంట్ ఇచ్చి ఏమి పండించమంటున్నావు కేసీఆర్. రైతులు పండించిన పంటలను కొనమంటే మరి రైతులు ఏమవ్వాలి. రూ.10 వేల కోట్లు కేటాయిస్తే మొత్తం ధాన్యం కొనవచ్చు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజ కొనాల్సిందే. రాష్ట్రంలోని 7,500 ఐకేపీ కేంద్రాలు తెరవాలి. రైతుల పంటలు కొనకుంటే కేసీఆర్ ఫామ్‌హౌస్‌ ముట్టడిస్తాం.' -రేవంత్​ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

రైతులతో దండు కట్టి ఉద్యమిస్తాం..

వచ్చే ఏప్రిల్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనకుంటే రైతులతో దండు కట్టి ఉద్యమిస్తానని రేవంత్​ రెడ్డి ప్రకటించారు. సీఎం కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో పండించిన ధాన్యాన్ని ఎలా కొంటారో.. పేద రైతులు పండించిన వడ్లను ఎలా కొనరో చూస్తామని హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో ఎల్లారెడ్డిలో కాంగ్రెస్​ అత్యధిక మెజార్జీతో గెలుస్తుందని రేవంత్​ ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సురేందర్‌.. కేసీఆర్‌కు అమ్ముడుపోయారని ఆయన విమర్శించారు. ఈ ప్రాంతంలో 'కల్లాల్లో కాంగ్రెస్‌' కార్యక్రమాన్ని పార్టీ నేతలు విజయవంతం చేశారని రేవంత్​ రెడ్డి వెల్లడించారు. పోడు భూముల సమస్య, తెరాస- భాజపా విధానాలపై ఇతర నేతలు విమర్శలు గుప్పించారు. ఈ సభకు అజారుద్దీన్, అంజన్‌ కుమార్, మల్లురవి, ఎమ్మెల్యే సీతక్క, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్​తో పాటు పలువురు నేతలు హాజరయ్యారు.

ఇదీ చదవండి:

Last Updated : Mar 20, 2022, 10:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.