కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల పరిషత్ ఎంపీపీ కృష్ణవేణి విప్ ఉల్లంఘించిందంటూ ఎన్నికైన మరుసటి రోజే కాంగ్రెస్ నాయకులు సాక్ష్యాలతో సహా ఫిర్యాదు చేశారు. ఉపాధ్యక్ష పదవితో పాటు కో ఆప్షన్ సభ్యుల ఎన్నికల సమయంలో పార్టీ విప్‌నకు విరుద్ధంగా తెరాసకు మద్దతు ప్రకటించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని కృష్ణవేణికి ప్రొసీడింగ్ అధికారి నోటీసులు జారీ చేయగా.... తాను పార్టీ విప్ తీసుకున్నట్లు తన సంతకం ఫోర్జరీ చేశారని కృష్ణవేణి వివరణ ఇచ్చారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికతో పాటు కాంగ్రెస్ నాయకులు సమర్పించిన వీడియో సాక్ష్యాల ఆధారంగా ఎంపీటీసీ సభ్యత్వాన్ని మంగళవారం సాయంత్రం అధికారులు రద్దు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి జిల్లా ఎన్నికల అధికారి సత్యనారాయణ ఈ విషయాన్ని తెలిపారు.
ఇవీ చూడండి: లెక్క తేల్చాలంటున్న అటవీ శాఖ!