కామారెడ్డి జిల్లాలో ఒక్కసారిగా కురిసిన వడగండ్ల వాన రైతులకు తీరని నష్టాల్ని తెచ్చిపెట్టింది. వరి కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. కేంద్రాల వద్ద ఎటుచూసినా నీరు నిలిచిపోయింది.
గంటసేపు ఏకధాటిగా కురిసిన వాన కారణంగా మామిడి తోటలోని కోత దశకు వచ్చిన మామిడి కాయలు నేలరాలాయి. ఈదురు గాలులతో కూడిన వర్షం పడడం వల్ల పలు చోట్ల రోడ్లపై చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి.
ఇదీ చూడండి:'మన జీవన విధానం ద్వారానే కరోనాను అడ్డుకోవచ్చు'