రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను ధిక్కరించి.. నియమాలకు విరుద్ధంగా వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్న ఓ వ్యాపార సంస్థపై కామారెడ్డి జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టణంలోని బీర్షెబ వ్యాపార సంస్థ వ్యాపార లావాదేవీలలో అక్రమాలు జరిగినట్లు తమకు ఫిర్యాదు అందిందని.. లెక్కలు పరిశీలించి క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
మున్సిపాలిటీ అధికారులు వ్యాపార సంస్థను సీజ్ చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైనా వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తే.. చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటి వరకు 42 కేసులు నమోదు చేసి.. 4 షాప్ లు సీజ్ చేసినట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: రైతులను వడ్డీంచకండి