ETV Bharat / state

'పిల్లలకు సరైన భోజనం పెట్టకపోతే చర్యలు తప్పవు'

author img

By

Published : Dec 10, 2019, 3:30 PM IST

కామారెడ్డి జిల్లా తిరుమలాపూర్​లో కస్తూర్భా బాలికల గురుకుల విద్యాలయాన్ని సభాపతి పోచారం తనిఖీ చేశారు. ప్రధానోపాధ్యాయుడిపై, భోజన నిర్వాహకులపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

pocharam
'పిల్లలకు సరైన భోజనం పెట్టకపోతే చర్యలు తప్పవు'

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని తిరుమలాపూర్​లో కస్తూర్భా బాలికల గురుకుల విద్యాలయాన్ని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు ఉదయంపూట అల్పాహారంలో భాగంగా పెట్టే ఉప్మాని తిని చూశారు.

ఉప్మా రుచి సరిగ్గా లేకపోవడం వల్ల ప్రధానోపాధ్యాయుడిపై, భోజన నిర్వాహకులపై మండిపడ్డారు. వంట చేసేందుకు నాసిరకమైన వస్తువులను వాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానోపాధ్యాయుడి పనితీరు సక్రమంగా లేకపోవడం వల్లే భోజన నిర్వాహకులు ఇలా వంట చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా తన ప్రవర్తన మార్చుకొని సక్రమంగా పని చేయాలని సూచించారు. లేనిపక్షంలో తగు చర్యలు తీసుకోవాల్సి వస్తుందని సభాపతి పోచారం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాజేశ్వర్, ఎంఈఓ నాగేశ్వరరావు, డీఎస్పీ దామోదర్ రెడ్డి తదితరులు ఆయన వెంట ఉన్నారు.

'పిల్లలకు సరైన భోజనం పెట్టకపోతే చర్యలు తప్పవు'

ఇవీ చూడండి: 'కశ్మీర్​ రాజకీయ నేతల విడుదల మా చేతుల్లో లేదు'

TG_NZB_01_10_AKASMIKA_THANIKI_CHESINA_SPEKAR_AVB_TS10122 కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని తిరుమల పూర్ క్యాంప్ లోనీ కస్తూర్బా బాలికల గురుకుల విద్యాలయమను ఆకస్మిక తనిఖీ చేసిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆకస్మిక తనిఖీలో భాగంగా స్పీకర్ ఉదయం పూట విద్యార్థులకు అల్పాహారంలో బాగంగా పెట్టే ఉప్మా చెట్ని చూశారు ఉప్మా నాసిరకంగా ఉండటంతో రుచికరంగా లేకపోవడంతో ప్రిన్సిపాల్ పై మరియు భోజన నిర్వాహకులపై మండిపడ్డారు పాఠశాల పాఠశాల తప్పని తీరుపై మరియు ఉపాధ్యాయులపై విద్యార్థులకు అందించే భోజనం వసతుల విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు విద్యార్థులకు పెట్టే భోజనం రుచికరంగా లేకపోవడంతో నాణ్యత లేకపోవడంతో నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థులకు అందించే భోజన సరుకులు నాసి రకమైన వస్తువులను వాడుతున్నారని మండిపడ్డారు అలాగే ప్రిన్సిపాల్ పై పాఠశాల పనితీరు సక్రమంగా లేకపోవడంతో మండిపడ్డారు భవిష్యత్తులో ఇలాంటి ఇలాంటివి పునరావృతం కావద్దని ఆదేశించారు ఇప్పటికైనా నా ప్రార్థన మార్చుకొని సక్రమంగా పని చేయాలని సూచించారు లేనిచో తగు చర్యలు తీసుకోవాల్సి వస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాజేశ్వర్ ఎంఈఓ నాగేశ్వరరావు డి.ఎస్.పి దామోదర్ రెడ్డి అధికారులు ఆయన వెంట ఉన్నారు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.