Self Help Groups Fishing on Terrace in Kamareddy : గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాలు ఎంతో ప్రత్యేకం. 10 నుంచి 12 మంది సభ్యులుండే స్వయం సహాయక బృందాల మహిళలు నెల నెల కొంత డబ్బును పొదుపు చేసుకుంటారు. అలాగే ప్రభుత్వం అందించే తక్కువ వడ్డీ బ్యాంకు రుణాలు తీసుకుంటూ తమ కుటుంబానికి అవసరమైన వివిధ పనులకు అండగా నిలుస్తారు. మరికొంత మంది కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేందుకు చిన్న చిన్న వ్యాపారాలు, కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటూ ముందుకు సాగుతుంటారు. కామారెడ్డి జిల్లాలోని డ్వాక్రా మహిళలు మాత్రం భిన్నంగా ప్రయత్నించారు. మిద్దెలు, పొలాల వద్ద చేపల పెంపకం చేస్తూ సరికొత్త వ్యాపారానికి శ్రీకారం చుట్టారు. కొందరు మహిళలు మంచి ఫలితాలు అందుకోవడంతో మిగతా సభ్యులూ ఆ దిశగా ముందుకొస్తున్నారు.
Self Help Group Fisharies Deportment : చేపల పెంపకం అంటే గుర్తొచ్చేవి సాధారణంగా చెరువులే. కామారెడ్డి డ్వాక్రా మహిళలు ఇందుకు భిన్నం. కొందరికి ఇది కులవృత్తి కాగా.. మరికొందరికి కనీసం చేపల పెంపకంపై అవగాహన కూడా లేదు. కానీ, ముత్యాలనే పెరట్లో పెంచుతున్నప్పుడు.. చేపల్ని ఎందుకు పెంచలేమనే ఆలోచన చేశారు. మిద్దెలు, పెరట్లో, పొలాల వద్ద చేపలు పెంచుతూ తోటి మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. స్త్రీనిధి(Sri Nidhi) రుణాలతో మీనాల పెంపకం చేపడుతూ.. తమ ఇంట మత్స్యసిరులు సృష్టిస్తున్నారు. మొదట్లో అధికారులు చేపల పెంపకం గురించి వీరికి చెప్పినప్పుడు అయ్యేపని కాదనుకున్నారు. సాధ్యాసాధ్యాలు వివరించి, రుణం ఇస్తామన్నా.. బెడిసి కొడితే పరిస్థితి ఏంటిని ఆలోచించారు. ఇలా అనేక అనుమానాల మధ్య మొదలైన వీరి మిద్దె చేపల సాగు.. ఇప్పుడు విజయవంతంగా నడుస్తోంది. మొదట లింగంపేటలో ప్రారంభమవ్వగా.. తర్వాత దోమకొండ, గాంధారి, సదాశివ నగర్, రాజంపేట, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాల 56 మంది మహిళలు గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో మిద్దె చేపల పెంపకం మొదలుపెట్టారు.
Kamareddy SHG Groups Fish Farming : కామారెడ్డి జిల్లాలో 16,957 ఎస్‌హెచ్‌జీల్లో.. 1,75,670 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఇందులో నుంచి 460 మంది సభ్యులను చేపల పెంపకం(Fish Farming) కోసం ఎంపిక చేశారు. ఇలా ఇప్పటి వరకు 56 యూనిట్లు ప్రారంభమయ్యాయి. మార్కెట్లో చేపలకు అధిక డిమాండ్ ఉండటంతో అధికారులు చేపల పెంపకాన్ని ప్రోత్సహించారు. అయితే చేపలు పెంచేందుకు ఇంటి దగ్గర లేదంటే పొలం వద్ద స్థలం ఉండాలి. ఉంటే షెడ్డు వేసి ట్యాంకు ఏర్పాటు చేసి అందులో చేపలు పెంచుకోవాల్సి ఉంటుంది. సమావేశాల్లో చేపల పెంపకం గురించి చెప్పినప్పుడు స్థలం లేకపోతే ఎలా అని కొందరు మహిళలకు అనుమానం వ్యక్తం చేశారు. అలాంటి సమయంలోనే వారు యూట్యూబ్‌లో కుటుంబ సభ్యుల సాయంతో మిద్దె మీద చేపల పెంపకం గురించి తెలుసుకున్నారు. ఇదే విషయం అధికారులతో పంచుకోగా.. నిర్వహణ, ఇతర అంశాల గురించి అధికారులు పూర్తిగా వివరించారు. దీంతో మిద్దె మీద చేపల పెంపకం ప్రారంభమైంది.
"మాకు చేపల పెంచేందుకు పొలం, చెరువు ఏమి లేవు. అధికారులు మిద్దెపై పెంచమని ప్రోత్సహించారు. మేము కూడా యూట్యూబ్‌లో చూశాం. దీంతో డ్వాక్రా గ్రూప్‌లో లోన్ తీసుకుని మొదలుపెట్టాం." - రాజ్యలక్ష్మి, మిద్దెపై చేపలు పెంచుతున్న మహిళ
Aqua Gives Guidelines to Fish Farming : గాంధారి మండల కేంద్రంలో రాజ్యలక్ష్మి, రేణుక అనే ఇద్దరు మహిళలు తమకు వేరే స్థలం ఏదీ లేకపోవడంతో మిద్దె మీదనే చేపలు పెంచడం ప్రారంభించారు. స్త్రీనిధి కింద 3 లక్షల వరకు రుణం తీసుకున్న రేణుక.. సొంతంగా మరో లక్ష వరకు ఖర్చు పెట్టుకుని ఇంటి పైన షెడ్డు నిర్మించుకున్నారు. వెయ్యి చేపలు పెంచే సామర్థ్యంతో టబ్ ఏర్పాటు చేసుకుని.. నిజాంసాగర్‌కు చెందిన ఉదయ్ ఆక్వా వాళ్ల సాయంతో చేప పిల్లలను తీసుకున్నారు. అధికారులు, ఆక్వా సిబ్బంది చెప్పిన విధంగా జాగ్రత్తలు పాటిస్తూ చేపలను పెంచుతూ వచ్చారు.
'మహిళలు ఆర్థికంగా ఎదిగితే కుటుంబానికి వెలుగు'
SHG Fisheries Main Theme : చేపలు పెంచేందుకు వాడిన నీటిని పునర్వినియోగం కింద పంటలకు, లేదంటే మొక్కలకు వినియోగిస్తున్నారు. మిద్దె మీద చేపలు పెంచుతున్న మహిళలు ఆ మిద్దె మీదనే వివిధ రకాల పూల మొక్కలు పెంచుతున్నారు. పురుగు మందులు వినియోగించినప్పుడు వచ్చే దిగుబడి కంటే చేపలకు వాడిన నీళ్ల ద్వారా అదనంగా దిగుబడి ఉందని గమనించారు. అదీకాక పంటలకు అవసరమైన పోషకాలు పుష్కలంగా లభిస్తున్నాయని అంటున్నారు. మహిళలు ఆర్థికంగా స్వయం శక్తి సాధించడమే ఈ చేపల పెంపకం ముఖ్యోద్దేశం. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహిళలకు క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు అనుమానాలు తీరుస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. రుణ సదుపాయం కల్పిస్తూ ఎప్పటికప్పుడు అండగా నిలుస్తున్నారు. ఇప్పటి వరకు కోటిన్నర రూపాయలను 56 మంది మహిళలకు అందించారు. మరో 200 మందికి త్వరలోనే రుణాలు మంజూరు చేస్తామని అంటున్నారు.
విత్తన బంతులు చల్లారు వండర్ బుక్ ఆఫ్ రికార్డు సాధించారు
సహకార సంఘాల సేవలు భేష్: మంత్రి ఎర్రబెల్లి
Women Empowerment Through SERP : స్వయం సహాయక బృందాల సాయంతో.. 'మిలియనీర్లుగా మహిళలు'