ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇటీవల భారీ వర్షాలతో రహదారుల రూపురేఖలు లేకుండా పోయాయి. కాలూర్, ఖానాపూర్, బోర్గాం(కె), మాక్లూర్, ఆర్మూర్‌కు వెళ్లే రహదారులు గుంతలతో నిండిపోయాయి. నవీపేట్, బోధన్ వంటి ప్రధాన రోడ్లతో పాటు గ్రామాలకు వెళ్లేదారులూ పూర్తిగా ధ్వంసమయ్యాయి. నవీపేట, రెంజల్, బోధన్, నందిపేట్, మాక్లూర్ మండలాల్లో గ్రామాలకు వెళ్లే రోడ్లు విపరీతమైన గుంతలతో నిండిపోయాయి.
నిజామాబాద్ జిల్లాలో ఆర్ అండ్ బీ రోడ్లు 6.. పంచాయతీరాజ్ రోడ్లు 14 చోట్ల కోతకు గురయ్యాయి. కామారెడ్డి జిల్లాలో వర్షాలతో పంచాయతీరాజ్ రోడ్లు 52.85 కిలోమీటర్లు, ఆర్ అండ్ బీ రోడ్లు 14 కిలోమీటర్లు ధ్వంసమయ్యాయి. గుంతలు తేలిన దారుల్లో.. ప్రయాణం అంటేనే వాహనదారుల్లో వణుకు వస్తోంది. అనేక మంది గుంతల్లో పడి గాయాల పాలవుతున్నారు. రాత్రి వేళ గుంతలు పడిన మార్గాల్లో ప్రయాణించాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఆసుపత్రి కోసం వెళ్లే రోగులు, గర్భిణీల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. తమ పరిస్థితి అధ్వానంగా ఉందంటున్న ఆటోడ్రైవర్లు.. వచ్చిన ఆదాయం రిపేర్లకే సరిపోతోందని ఆవేదన చెందుతున్నారు.
ఏళ్లుగా గుంతలు తేలి నరకం చూపిస్తున్న రోడ్లు.. వర్షాలకు మరింత భయంకరంగా మారాయని వెంటనే అధికారులు స్పందించి మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు. ఆరోగ్యం, ప్రాణ, ఆర్థిక నష్టాల నుంచి కాపాడాలని వేడుకుంటున్నారు.
ఇవీ చూడండి..
రాష్ట్రంలో వరద నష్టాలపై కేంద్ర బృందం అధ్యయనం
Bullet in monkey shoulder : కుక్క కరిచిందని కోతికి వైద్యం.. భుజంలో బుల్లెట్ చూసి డాక్టర్లు షాక్