Bharat Jodo Yatra End Today in Telangana: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర రాష్ట్రంలో నేడు ముగియనుంది. ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న రాహుల్ పాదయాత్ర.. మహారాష్ట్రలోకి ప్రవేశించనుంది. రాష్ట్రంలో 12 రోజుల పాటు సాగిన యాత్ర ఇవాళ్టితో 375 కిలోమీటర్లు పూర్తి చేసుకోనుంది. భారత్ జోడో యాత్రలో భాగంగా ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న రాహుల్‌గాంధీ.. తన ఆలోచనలను వారితో పంచుకుంటూ ముందుకు సాగుతున్నారు.
ఈ క్రమంలోనే తనను కలవడానికి వస్తున్న మేధావులు, ప్రతినిధులతోనూ విరామ సమయంలో రాహుల్ సమాలోచనలు చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం జుక్కల్ నియోజకవర్గంలోని మేనూరులో కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో జోడో యాత్రలో భాగంగా నిర్వహించే చివరి సభ కావడంతో కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది.
ఇవీ చూడండి..
'భారత్ జోడో యాత్ర దేశ చరిత్రలో నిలిచిపోతుంది'
కేంద్రంలో మోదీ.. రాష్ట్రంలో కేసీఆర్... ఉద్యోగ కల్పనను దెబ్బతీశారు: రాహుల్