కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలో నిర్మిస్తోన్న పల్లె ప్రకృతి వనం పనులను జిల్లా కలెక్టర్ డా.శరత్ పరిశీలించారు. పచ్చదనంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని కలెక్టర్ అన్నారు. సదాశివనగర్, గాంధారి మండలంలోని వివిధ గ్రామాల్లో ఆయన పర్యటించారు. పద్మాజివాడిలో నిర్మిస్తోన్న రైతు వేదిక పనులను పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
భూంపల్లి శివారులో అవెన్యూ ప్లాంటేషన్లో నాటిన మొక్కలు ఎండినందుకు పంచాయతీ కార్యదర్శిని కలెక్టర్ శరత్ సస్పెండ్ చేశారు. సదాశివనగర్ ఎంపీడీవో, ఎంపీవోలకు ఛార్జి మెమోలు జారీ చేశారు. గుడిమెట్, పోతంగల్లో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను పరిశీలించారు. మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యం వహిస్తే సర్పంచులు, అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.