కామారెడ్డి మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులకు కలెక్టర్ శరత్ కుమార్ పీపీఈ కిట్లు అందజేశారు. కరోనా వైరస్ సోకే ఆస్కారం ఉన్నా.. తమ ప్రాణాలకు తెగించి ప్రజల శ్రేయస్సు కోసం పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నారని కలెక్టర్ అన్నారు. వీరు పని చేయడం ద్వారానే అంటువ్యాధుల భయం తగ్గిందని తెలిపారు.
సేవ.. సామాజిక బాధ్యత
పారిశుద్ధ్య కార్మికుల ప్రాణాలు కాపాడడం సామాజిక బాధ్యతగా భావించాలని కలెక్టర్ శరత్ కుమార్ అన్నారు. ఆసామాజిక స్పృహతోనే ప్లాశ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ముందుకు వచ్చి జిల్లాలోని 3 మున్సిపాలిటీలలోని 300ల మంది పారిశుద్ధ్య కార్మికులకు నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలతో మాస్కులు, పీపీఈ కిట్లు అందజేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ శ్వేత, మున్సిపల్ ఛైర్మన్ జాహ్నవి పాల్గొన్నారు.
ఇదీ చూడండి: జూడాల సమ్మె కొనసాగింపు.. సూపరింటెండెంట్‌కు లేఖ