ETV Bharat / state

బాన్సువాడ నియోజకవర్గంలో లబ్ధిదారులకు రెండు పడక గదుల ఇళ్లు

అర్హత గల లబ్ధిదారులందరికీ ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్లు మంజూరు చేస్తుందని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్​ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాడుకోల్​ గ్రామంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. నిరుపేదల ఆత్మ గౌరవాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్​ ఈ పథకం ప్రవేశపెట్టారని పేర్కొన్నారు.

pocharam srinivasareddy distributed two bed room house reg papers in bansuvada
బాన్సువాడ నియోజకవర్గంలో లబ్ధిదారులకు రెండు పడకల ఇళ్లు
author img

By

Published : Nov 2, 2020, 7:19 AM IST

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాడుకోల్ గ్రామంలో లబ్ధిదారులకు శాసన సభాపతి పోచారం శ్రీనివాస్​ రెడ్డి.. రెండు పడక గదుల ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. అర్హత గల లబ్ధిదారులందరికీ డబుల్​ బెడ్​ రూమ్​ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. నిరుపేదల ఆత్మగౌరవాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారని పోచారం చెప్పారు. బాన్సువాడ నియోజకవర్గంలో ఇప్పటివరకు 5000 ఇళ్లను లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు. ఇంకా 10 వేల ఇళ్లు ప్రభుత్వం మంజూరు చేసే విధంగా తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

అవినీతికి పాల్పడితే చర్యలే

లబ్ధిదారులు ఎవరైనా డబ్బులు ఇచ్చి ఇల్లు తీసుకున్నట్లు తెలిస్తే వారి ఇల్లును రద్దు చేసి అర్హత గల నిరుపేదలకు అందజేస్తామని పోచారం అన్నారు. ప్రజాప్రతినిధులు ఎవరైనా రెండు పడకల ఇల్లు ఇప్పిస్తామని అవినీతికి పాల్పడినట్లు తేలితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

బాన్సువాడ నియోజకవర్గం రెండు పడకల ఇళ్ల నిర్మాణంలో ఆదర్శంగా నిలిచిందని జిల్లా కలెక్టర్ శరత్ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ ఛైర్మన్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: వర్క్‌ ఫ్రం హోం భారం.. చేయకుంటే కొలువుకు గండం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.