ETV Bharat / state

'సాగునీటి కోసం పడిగాపులు కాసే రోజులు పోయాయి’

రాష్ట్రంలో గతంలో నీటి కొరత విపరీతంగా ఉండేదని శాసన సభాపతి పోచారం గుర్తు చేశారు. సాగునీరు అందక రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కునేవారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో.. ఆ బాధలన్నీ తీరిపోయాయని వివరించారు. కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్ట్​లోకి మంజీరా నది నుంచి వస్తోన్న నీటికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు.

kaleshwaram
kaleshwaram
author img

By

Published : Apr 22, 2021, 10:01 PM IST

కోటి 50 లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందించగల కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి.. సీఎం కేసీఆర్ అపర భగీరథుడిలా నిలిచారంటూ శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి కొనియాడారు. ఉచిత కరెంటు, పెట్టుబడి, రైతుబంధు వంటి వాటితో రైతుకు వెన్నంటే ఉండి కృషి చేస్తున్నారని వివరించారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం వెంకంపల్లి గ్రామ శివారులోని నిజాంసాగర్ ప్రాజెక్ట్​లోకి మంజీరా నది నుంచి వస్తోన్న నీటికి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి పాల్గొని.. గోదావరి జలాలకు స్వాగతం పలికారు.

రాష్ట్రంలో గతంలో నీటి కొరత విపరీతంగా ఉండేదని పోచారం గుర్తు చేశారు. ఉమ్మడి నిజామాబాద్​లో.. సాగునీరు అందక రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. నిజాంసాగర్ ప్రాజెక్టు ఎగువన ఉన్న సింగూరు ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయాలని ఆనాటి ముఖ్యమంత్రుల వద్ద రైతులు పడిగాపులు కాసేవారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అలా బాధపడ్డ రైతుల్లో.. తానూ ఒకడినని గుర్తు చేసుకున్నారు. ప్రత్యేక రాష్ట్రంలో.. కేసీఆర్ పుణ్యమా అని సాగు నీటి కష్టాలు తీరిపోయినట్లు వివరించారు.

రైతుల శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రమంతా సాగునీటి కొరత తీరిందని వివరించారు. మంజీరా, నిజాంసాగర్ ప్రాజెక్టులోకి కాళేశ్వరం నీరు రావడం హర్షణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో.. జడ్పీటీసీలు, ఎంపీపీలు, మార్కెట్ కమిటీ ఛైర్మన్లు, ప్రాథమిక సహకార సంఘాల సభ్యులు, తెరాస నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: సరిహద్దుల్లో కనిపించని కరోనా కట్టడి చర్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.