ETV Bharat / state

'బండి స్టార్ట్ కావడం లేదని పెట్రోల్ పోసి తగులబెట్టాడు' - బైక్​పై పెట్రోల్ పోసి తగలబెట్టిన యజమాని

ద్విచక్రవాహనం స్టార్ట్​ కాకపోవడంతో విసుగు చెంది ఓ వ్యక్తి ఏకంగా దానిని తగులబెట్టేశాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది.

owner poured petrol on the two-wheeler and set it on fire in kamareddy district
ద్విచక్రవాహనాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టిన యజమాని
author img

By

Published : Aug 25, 2020, 10:27 PM IST

కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలోని జీఎంఆర్ గార్డెన్ సమీపంలో ఓ వ్యక్తి బైక్ ఆగిపోయింది. వాహనదారుడు పలుమార్లు ప్రయత్నించినా స్టార్ట్ కాకపోవడం వల్ల విసుగుచెంది బండి​లో పెట్రోల్ తీసి దానిపై పోసి తగులపెట్టాడు. అనంతరం శిరస్త్రాణం ధరించి నడుచుకుంటూ వెళ్లిపోయాడు.

ఈ ఘటనలో ద్విచక్రవాహనం పూర్తిగా కాలిపోయింది. ఆ వ్యక్తి బానాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు.

ఇవీ చూడండి: 'సెప్టెంబరు నెలాఖరుకు పూర్తి నియంత్రణలోకి కరోనా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.