ETV Bharat / state

గొర్రెల కాపరికి బ్యాంకు నోటీసులు.. ఆయనసలు రుణమే తీసుకోదట!

ఆయనొక గొర్రెల కాపరి. హైదరాబాద్​లోని ఎస్బీఐ జవహార్​నగర్ శాఖ ఎక్కడ ఉంటుందో తెలియదు. ఎప్పుడూ ఆ బ్యాంక్​కు రాలేదు. అయినా ఆయన పేరు మీద 7 లక్షల రుణాన్ని ఆ బ్యాంకు మంజూరు చేసింది. 60 వాయిదాలలో రుణాన్ని చెల్లించాలంటూ నోటీసులూ జారీ చేసింది. అయితే ఆ రుణం ఎవరి ఖాతాలో జమ చేశారో.. ఎవరు తీసుకున్నారో.. తనకు అసలు ఎస్బీఐ ఖాతానే లేదని కాపరి లబోదిబోమంటున్నాడు.

Notices to the shepherd to pay the debt of 7 lakhs at issannapalli in kamareddy district
ఏడు లక్షల రుణం చెల్లించాలని గొర్రెల కాపరికి నోటీసులు!
author img

By

Published : Jan 22, 2021, 7:22 PM IST

ఏడు లక్షల రుణాన్ని తీసుకున్నాడని.. 60 వాయిదాల్లో తీసుకున్న రుణాన్ని చెల్లించాలని హైదరాబాద్​లోని ఎస్బీఐ జవహార్​నగర్ శాఖ ఓ గొర్రెల కాపరి నోటీసులు జారీ చేసింది. అసలు రుణమే తీసుకోకుండా.. అంత మొత్తాన్ని తానెలా చెల్లించాలని ఇసన్నపల్లికి చెందిన కన్నాపురం బాలమల్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇసన్నపల్లికి చెందిన కన్నాపురం బాలమల్లుకు ఈ నెల పదో తేదీన హైదరాబాద్​లోని ఎస్బీఐ జవహర్నగర్ శాఖ నుంచి నోటీసు వచ్చింది. మీరు గతేడాది డిసెంబర్ 12న ఏడు లక్షల రుణం తీసుకున్నారు. 60 వాయిదాలలో ఆ రుణాన్ని చెల్లించండి అని ఆ నోటీసులో పేర్కొన్నారు. అవాక్కయిన బాలమల్లు వివరాలు కనుక్కునేందుకు హైదరాబాద్​లోని ఎస్బీఐ బ్యాంకుకు వెళ్లాడు. అధికారులను కలిసి తనకు జవహర్ నగర్ శాఖలో బ్యాంక్ ఖాతా లేదని అసలు ఇప్పటివరకు ఈ బ్యాంకుకు రాలేదని చెప్పాడు. అలాంటప్పుడు నేను ఎలా రుణం తీసుకుంటానని ప్రశ్నించాడు.

బ్యాంకు అధికారులు పరిశీలించగా.. సంతకంతో పాటు ఆధార్ కార్డు ఫోటో వేరే వ్యక్తివి ఉన్నట్లు గుర్తించారు. ఫిర్యాదు చేస్తే పరిశీలిస్తామని వారు చెప్పారన్నాడు. తాను చదువుకోలేదని ఫిర్యాదు ఎలా రాయాలో తెలియక తిరిగి వచ్చానన్నాడు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నాడు.

ఇదీ చూడండి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయావకాశాలు పుష్కలం: జీవన్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.