కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం బోసిపోయింది. సుదీర్ఘ విరామం తర్వాత వ్యవసాయేతర ఆస్తుల నమోదుకు అవకాశం ఇచ్చినా ప్రజలు ఆసక్తి చూపలేదు. దాదాపు మూడు నెలల తర్వాత నమోదు ప్రక్రియ ప్రారంభం కాగా జనాలు లేక కార్యాలయం వెలవెల బోయింది.
వ్యవసాయేతర ఆస్తుల నమోదుకు ధరణి పోర్టల్ ద్వారా స్లాట్‌ను ఎవరూ బుక్ చేసుకోలేదని సబ్ రిజస్ట్రార్ సురేష్ వెల్లడించారు. పోర్టల్‌లో ఎలాంటి సాంకేతిక సమస్యలు లేవని ఆయన అన్నారు. ఎవరైనా రిజిస్ట్రేషన్‌కు వస్తే త్వరితగతిన ప్రక్రియ పూర్తి చేస్తామని రిజిస్ట్రార్ తెలిపారు.