లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ స్థానం నుంచి తెరాస అభ్యర్థిగా సీఎం కేసీఆర్ కూతురు, సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవిత పోటీచేయగా, భాజపా తరుఫున రాజ్యసభ సభ్యులు డీఎస్ తనయుడు ధర్మపురి అర్వింద్ బరిలో నిలిచారు. కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ, కాంగ్రెస్ ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ పోటీ చేశారు. 178మంది పసుపు, ఎర్రజొన్న రైతులు పోటీ చేశారు. నియోజక వర్గంలో ఎక్కడ చూసినా అభ్యర్థుల గెలుపోటములపైనే చర్చ జరుగుతోంది. ఎవరికి వారే గెలుపు తమదేనని ధీమాగా ఉన్నారు.
ఇదీ చదవండి: అన్నదాతలు అయ్యారు అడ్డా కూలీలు..