ETV Bharat / state

కుమార్తె హిందువు.. ముస్లిం తల్లిదండ్రులు.. అనాథ వరుడు

అనాథ బాలికను ఆదరించి... విద్యాబుద్ధులు నేర్పించి.... పెళ్లి చేసి మానవత్వం చాటారు కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన ముస్లిం దంపతులు (muslim couple marry off orphan girl to hindhu groom). హిందూ సంప్రదాయం ప్రకారం కాళ్లు కడిగి... కన్యాదానం చేశారు.

Muslim couple marry
Muslim couple marry
author img

By

Published : Oct 25, 2021, 5:24 PM IST

Updated : Oct 29, 2021, 6:47 PM IST

కామారెడ్డి జిల్లా (kamareddy district) బాన్సువాడ మండలం బోర్లామ్ గురుకుల పాఠశాల ప్రధాన అధ్యాపకురాలు ఇర్ఫానాబాను, హైమద్ దంపతులు... తమ ఔదార్యం చాటుకున్నారు (Muslim couple married to an orphan girl). అనాథ బాలికను ఆదరించి... విద్యాబుద్ధులు నేర్పించి.... పెళ్లి చేసి మానవత్వం చాటారు. తాడ్వాయి గురుకుల పాఠశాలలో ఇర్ఫానా ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న సమయంలో... తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన లింగంపేట్ మండలం శెట్​పల్లికి చెందిన చందన(రజిత)ను బంధువులు ఆరో తరగతిలో చేర్పించారు. సెలవుల్లో అందరూ ఇళ్లకు వెళ్తుంటే... ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి చందనది. ఇది గ్రహించిన ఇర్ఫానా... చందనను తన ఇంటికి తీసుకెళ్లి పాఠశాల ప్రారంభం అయిన తర్వాత తీసుకొచ్చేవారు. ఇలా తమ వద్దే పదో తరగతి వరకు చదివించారు.

వధూవరులు చందన, వెంకట్​రామ్ రెడ్డి
వధూవరులు చందన, వెంకట్​రామ్ రెడ్డి

అనాథ అని తెలిసినా..

అనంతరం తాడ్వాయిలో ఇంటర్, బోధన్​లోని ఓ ప్రైవేట్ కళాశాలలో.. 70 వేల రూపాయలు ఖర్చు చేసి డీఎంఎల్​టీ పూర్తి చేయించారు. అలాగే చందన (Orphaned young woman) పెళ్లి బాధ్యత కూడా వారే తీసుకున్నారు. నస్రుళ్లబాద్ మండలం బొమ్మన్​దేవ్​పల్లికి చెందిన అనాథ యువకుడు వెంకట్​రామ్ రెడ్డికి ఇచ్చి పెళ్లి చేశారు (muslim couple marry off orphan girl to hindhu groom). వరుడు ఎలక్ట్రిషియన్​గా పని చేస్తున్నాడు

నవ దంపతులతో.. ఇర్ఫానాబాను హైమద్ దంపతులు
నవ దంపతులతో.. ఇర్ఫానాబాను హైమద్ దంపతులు

తలొకరూ తలోకొంత...

వీరిద్దరికి ఆదివారం బాన్సువాడలోని ఓ కల్యాణ మండపంలో... హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిపించారు. వరుడి కాళ్లు కడిగి... ఇర్ఫానా, హైమద్ దంపతులు కన్యాదానం చేశారు. బోర్లామ్ పాఠశాల సిబ్బంది 75వేల రూపాయలతో... పెళ్లి వస్త్రాలు, సామగ్రి అందజేశారు. స్థానిక వ్యాపారి సాయిబాబా గుప్తా లక్ష రూపాయలు అందించారు. హిందూ యువతికి.... ముస్లింలు అయినా ఆదరించి పెళ్లి చేసిన ఇర్ఫానా, హైమద్ దంపతులను అందరూ అభినందించారు.

కన్యాదానం చేస్తున్న ముస్లిం దంపతులు
కన్యాదానం చేస్తున్న ముస్లిం దంపతులు

ఇదీ చూడండి: 100 years celebration: 186 మంది కుటుంబసభ్యుల మధ్య వందేళ్ల బామ్మ బర్త్​డే సెలబ్రేషన్స్

Last Updated : Oct 29, 2021, 6:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.