ETV Bharat / state

'కేసీఆర్ వృక్ష ప్రేమికుడు... అందుకే కోటి వృక్షార్చన'

ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. తెరాస నేతలు, శ్రేణులు, ప్రజాప్రతినిధులు తమ అభిమాన నేతకు శుభాకాంక్షలు చెబుతూ... స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎంపీ సంతోష్‌కుమార్‌ పిలుపుమేరకు కోటివృక్షార్చనలో పాల్గొంటున్నారు.

minister vemula prashanth reddy plantation at kamareddy district
'కేసీఆర్ వృక్ష ప్రేమికుడు... అందుకే కోటి వృక్షార్చన'
author img

By

Published : Feb 17, 2021, 2:04 PM IST

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వృక్ష ప్రేమికుడని... అందుకే ఆరేళ్లుగా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలోని పల్లె ప్రకృతి వనంలో మొక్కలు నాటారు.

అనంతరం మండల కేంద్రంలోని చెరువు కట్టపై నాటిన ఈత మొక్కలను మంత్రి పరిశీలించారు. కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమంతో గతంలో కంటే 4.7 శాతం పచ్చదనం పెరిగిందని వేముల పేర్కొన్నారు. మరొక నాలుగు శాతం పచ్చదనాన్ని పెంచుకుంటే భవిష్యత్తులో వర్షాలకు ఢోకా ఉండదన్నారు. ముఖ్యమంత్రి ఇలాంటి జన్మదిన వేడుకలు మరిన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

ఇదీ చూడండి: పదివేల మొక్కలు నాటే కార్యక్రమానికి హరీశ్​ శ్రీకారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.