అది కర్ణాటక, మహారాష్ట్రలకు వెళ్లే ప్రధాన రహదారి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తాత్కాలికంగా వేసిన వంతెన వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం పెద్ద దేవాడ, పుల్కల్ గ్రామాల మధ్య ఉన్న కౌలాస్ వాగుపై ప్రయాణికుల కష్టాలు అన్ని ఇన్ని కావు. ఇక్కడ వంతెన నిర్మాణానికి ఐదు సంవత్సరాల క్రితం ఎనిమిది కోట్ల నిధులు మంజూరు అయ్యాయి. కానీ ఇప్పటివరకు పనులు పూర్తి చేయలేదు. దీంతో ప్రయాణికుల సౌకర్యార్థం పక్కనే పైపులు, మట్టితో తాత్కాలిక వంతెన వేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు పైపులు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికులు వాగుల నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. మద్నూర్ , బిచ్కుంద, జుక్కల్ మండల ప్రజలు బాన్సువాడ, కామారెడ్డి, నిజామాబాద్, బోధన్ ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ మార్గం గుండానే వెళ్లాల్సి ఉంది. వంతెన కొట్టుకుపోయి వారం రోజులు గడిచినా అధికారులు మాత్రం ఇప్పటివరకు పట్టించుకోవడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు.
తెగిన కౌలాస్ వాగు వంతెన... కష్టాల్లో ప్రజలు - kovlas bridge collapsed in kamareddy dist
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని కౌలాస్ వాగుపై నిర్మించిన తాత్కాలిక వంతెన వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. మండల ప్రజలు కామారెడ్డి, నిజామాబాద్, బోధన్ వెళ్లాలంటే వాగు దాటేందుకు ఇక్కట్లు పడుతున్నారు.
అది కర్ణాటక, మహారాష్ట్రలకు వెళ్లే ప్రధాన రహదారి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తాత్కాలికంగా వేసిన వంతెన వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం పెద్ద దేవాడ, పుల్కల్ గ్రామాల మధ్య ఉన్న కౌలాస్ వాగుపై ప్రయాణికుల కష్టాలు అన్ని ఇన్ని కావు. ఇక్కడ వంతెన నిర్మాణానికి ఐదు సంవత్సరాల క్రితం ఎనిమిది కోట్ల నిధులు మంజూరు అయ్యాయి. కానీ ఇప్పటివరకు పనులు పూర్తి చేయలేదు. దీంతో ప్రయాణికుల సౌకర్యార్థం పక్కనే పైపులు, మట్టితో తాత్కాలిక వంతెన వేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు పైపులు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికులు వాగుల నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. మద్నూర్ , బిచ్కుంద, జుక్కల్ మండల ప్రజలు బాన్సువాడ, కామారెడ్డి, నిజామాబాద్, బోధన్ ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ మార్గం గుండానే వెళ్లాల్సి ఉంది. వంతెన కొట్టుకుపోయి వారం రోజులు గడిచినా అధికారులు మాత్రం ఇప్పటివరకు పట్టించుకోవడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు.
TAGGED:
kamareddy latest news