ETV Bharat / state

కామారెడ్డి ప్రజలారా ! డ్రోన్ కెమెరాతో నజర్... - కలెక్టర్ శరత్ కుమార్,

కామారెడ్డి జిల్లాలో లాక్ డౌన్​ అమలును పరిశీలించేందుకు డ్రోన్ కెమెరాను వినియోగించనున్నట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది. నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నామని...అకారణంగా వాహనాలతో బయటకు వస్తే కేసులు నమోదు చేస్తామని జిల్లా పోలీస్ విభాగం హెచ్చరించింది.

అకారణంగా బయటకు వచ్చారా...కేసులు నమోదే : ఎస్పీ

author img

By

Published : Apr 16, 2020, 7:33 PM IST

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పట్టణ పోలీస్ స్టేషన్లో డ్రోన్ కెమెరా నిఘా నేత్రాన్ని కలెక్టర్ శరత్ కుమార్, ఎస్పీ శ్వేతారెడ్డి ప్రారంభించారు. కామారెడ్డి పట్టణంలో డ్రోన్ కెమెరా ద్వారా లాక్ డౌన్ నిబంధనలు పర్యవేక్షించనున్నారు. అంతకుముందు జిల్లా ఆస్పత్రిలో 'మై విలేజ్ మై మోడల్ విలేజ్ ఫౌండర్' కీ.శే. బాలరాజు గౌడ్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జిల్లా ఆస్పత్రిలో పని చేస్తున్న సిబ్బందికి పీపీఈ కిట్లను పంపిణీ చేశారు.

ప్రతి ఏరియాలో డ్రోన్...

జిల్లాలో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేయబోతున్నామని ఎస్పీ శ్వేతా అన్నారు. డ్రోన్ కెమెరా ద్వారా పట్టణంలోని ప్రతి ఏరియాలో డ్రోన్ కెమెరా ద్వారా పర్యవేక్షిస్తామని స్పష్టం చేశారు. ప్రజలు కచ్చితంగా లాక్ డౌన్ నిబంధనలు పాటించాలని, లేకపోతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ వెంకటేష్ దొత్రే, అసిస్టెంట్ కలెక్టర్ నందన్ లాల్ పవార్, ఆస్పత్రి సూపరిండెంట్ డా.అజయ్ కుమార్, డిఎస్పీ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : లాక్​డౌన్​ ముగిశాక కొత్త రూల్స్​ ఇవే...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.