కామారెడ్డి జిల్లా బీర్కూర్, నసురుల్లాబాదు మండలం మైలారంలోని పల్లె వనాలను కలెక్టర్ శరత్ పరిశీలించారు. బెంచీలు, ఫౌంటేషన్ ఏర్పాటు చేయాలని సర్పంచ్ కోరారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి పల్లె వనాలు దోహదపడతాయన్నారు.
జిల్లాలో ఇప్పటివరకు 104 రైతు వేదిక భవనాలు నిర్మాణంలో ఉండగా.. 75 భవనాల నిర్మాణ పనులు పూర్తి చేసినట్లు చెప్పారు. 29 భవనాల నిర్మాణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయన్నారు. ఈనెల 15లోగా రైతు వేదిక భవనాల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామాల్లోని తడి పొడి చెత్తను షెడ్‌కి తరలించి సేంద్రియ ఎరువులను తయారు చేయాలన్నారు.
ఇదీ చదవండి: 400 మంది విద్యార్థుల కష్టం తీర్చిన 'ఈటీవీ భారత్'