కామారెడ్డి జిల్లా బాన్సువాడలో శనివారం వైద్యశాఖపై జిల్లా పాలనాధికారి శరత్ సమీక్షించారు. పిట్లంలో 2, బిచ్కుందలో 1 చొప్పున ఖాళీగా ఉన్న డాక్టర్ ఉద్యోగాలకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైనవారు బాన్సువాడ ఆర్డీవో కార్యాలయం, కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
మద్నూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో 45 ఏళ్లు నిండిన వారందరికీ కొవిడ్ టీకా వేయాలని వైద్యులను ఆదేశించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్, ఆర్డీవో రాజా గౌడ్, వైద్యులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఆర్డరివ్వండి... పోస్టులో ప్రసాదం మీ ఇంటికొస్తుంది..