కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలంలో జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ సుడిగాలి పర్యటన చేశారు. బీబీపేట్ మండల కేంద్రంలో పర్యటించి ఉపాధి హామీ పనులు, హరితవనం, వైకుంఠధామం, ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ప్రజలకు కరోనా పట్ల అవగాహన కల్పించారు.వైరస్ బారిన పడకుండా ఉండాలంటే.. భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని ప్రజలకు చెప్పారు. హరితహారంలో నాటిన మొక్కలు పరిరక్షించాలని సూచించారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని, పండించిన ప్రతి గింజ ప్రభుత్వం కొంటుందని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: కరోనా లక్షణాల పరిశోధనలో మలుపు