కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కరోనా నియంత్రణపై అధికారులతో జిల్లా కలెక్టర్ శరత్ శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలోని కొవిడ్ వార్డును సందర్శించారు. కరోనా బాధితులు, ఇతర రోగుల ఆరోగ్య పరిస్థితులను గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ఆక్సిజన్ పరికరాల పనితీరు, ఆక్సిజన్ నిల్వల గురించి అధికారులతో చర్చించారు. ఏరియా ఆస్పత్రిలో కరోనా రోగుల కోసం వంద పడకలు అందుబాటులో ఉన్నట్లు కలెక్టర్ వివరించారు.
కరోనా నియంత్రణకు సరైన ఆయుధం లాక్డౌన్యే అన్ని కలెక్టర్ శరత్ తెలిపారు. బాన్సువాడలో అమలవుతున్న లాక్డౌన్ తీరును దగ్గరుండి పరిశీలించారు. అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న వారికి జరిమానాలు విధించారు. లాక్డౌన్ కఠినంగా అమలు చేయాలని పోలీసు శాఖకు ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ రాజా గౌడ్, తహసీల్దార్ గంగాధర్, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ రమేష్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి : మాంసం దుకాణాల వద్ద బారులుతీరిన జనం.. కనిపించని భౌతికదూరం