జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఇంకుడు గుంత నిర్మిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. కళాశాల ఆవరణలోని అనుకూల ప్రాంతాన్ని గుర్తించి హర్వెస్టింగ్ విధానం ఏర్పాటు చేస్తామన్నారు. దీనివల్ల భూగర్భ జలాలు పెరుగుతాయని పేర్కొన్నారు. కళాశాలలో ఫిషరీస్ విభాగం ఉన్నందున చేపల చెరువు కూడా నిర్మిస్తామన్నారు. ఇప్పటికే ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశామని త్వరలో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని కలెక్టర్ తెలిపారు.
ఇదీ చూడండి: ఇక ఉల్లి కిలో 40రూపాయలకే!