శుక్రవారం జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నిక ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. జిల్లా యంత్రాంగం ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుందని కలెక్టర్ అన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందని తెలిపారు.
జిల్లాలో మొత్తం 22 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, కొవిడ్ నిబంధనల ప్రకారం ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. జిల్లాలో 341 మంది ఓటర్లు ఉన్నారని, పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల వివరాలు ఇప్పటికే అందజేయడం జరిగిందని వివరించారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద మెడికల్ ఆఫీసర్, సిబ్బంది ఉంటారని, అలాగే 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్క ఓటరు మాస్కు, గ్లౌజ్ ధరించి ఓటు వేయడానికి రావాలని సూచించారు.
ఇవీ చూడండి: పోలింగ్ ఏర్పాట్లు పూర్తి.. ఓటేసేందుకు సిద్ధంకండి..