కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో గురు రాఘవేంద్ర పత్తి మిల్లులో జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
కొనుగోలు కేంద్రంలో పత్తి ధర క్వింటాలుకు రూ.5,825 ఉందన్నారు. నాణ్యమైన పత్తి తెచ్చి మద్దతు ధరను పొందాలని రైతులకు ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో మార్కెటింగ్ సీసీఐ అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: రెండ్రోజుల క్రితం ప్రగతిభవన్లో చిరంజీవి.. అధికారులకు కరోనా పరీక్షలు