కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని జల్దిపల్లి గ్రామంలో రోడ్డు పక్కన ఉన్న ధాన్యం కుప్పల పై నిద్రిస్తున్న బొడ్డు శంకర్ (30) పై తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఉదయం అటుగా వచ్చిన స్థానికులు చూసేసరికి ధాన్యం బస్తాలపై రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే స్థానికులు కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ కు తరలించి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
శంకర్ భార్య అనిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ శశాంక్ రెడ్డి పరిశీలించారు.
ఇవీ చదవండి: పోలీస్ స్టేషన్లో రియల్ ఫైట్.. కుర్చీలు కర్రలతో ఇరువర్గాల దాడి