ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతం గిల్మన్స్ 5,685 మీటర్ల పాయింట్‌ను అధిరోహించి అరుదైన ఘనతను సాధించిన తండ్రీకూతుళ్లను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రత్యేకంగా అభినందించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డికి చెందిన తిరునగరి శ్రీకాంత్, అతని కుమార్తె హిమలేఖ్యకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ పంపారు.
ధైర్యం, దృఢ సంకల్పంతో కష్టసాధ్యమైన అరుదైన ఘనత సాధించిన తండ్రీకూతుళ్లు రాష్ట్రానికే గర్వకారణమని దత్తాత్రేయ పేర్కొన్నారు. భవిష్యత్‌లో ప్రపంచంలోని ఎత్తైన పర్వతాలను అధిరోహించే దిశగా మరిన్ని అద్భుతాలు సాధించాలని కోరారు.
ఇదీ చదవండి: రాగల మూడ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం