కామారెడ్డి జిల్లాలో శనివారం కురిసిన భారీ వర్షం రైతుల పాలిట శాపమైంది. ఇటీవల కోసిన మొక్కజొన్న పంటను జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డు అవరణలో, రోడ్డుపైన ఆరబోసిన మొక్కజొన్నలు తడిసి ముద్దయ్యాయి. చేతికి వచ్చిన మొక్కజొన్న పంట వర్షానికి తడిసి ముద్దవడంతో రైతన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షానికి తడిచిన మొక్కజొన్నలు మొలకెత్తి పాడైపోతాయని దిగులు చెందుతున్నారు.
జిల్లా కేంద్రంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రధానంగా స్టేషన్, సిరిసిల్ల రోడ్డు ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపై నిలిచింది. లోతట్టు ప్రాంతాలైన బతుకమ్మ కుంట ప్రాంతాల్లో నీరు ఇళ్లలోకి చేరింది. జిల్లాలోని చుట్టుపక్కల గల మండలాల్లో సైతం వర్షం భారీగా కురిసింది. జిల్లాలోని భిక్నూర్ మండలంలో పలు చోట్ల వరి పంట నేలకొరిగి...తీవ్ర నష్టం వాటిల్లింది.
ఇదీ చూడండి: కామారెడ్డిలో భారీ వర్షం... చెరువులను తలపిస్తోన్న రహదారులు