కామారెడ్డిలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. సుమారు గంట పాటు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి రహదారులు జలదిగ్బందంలో చిక్కుకున్నాయి. ప్రధాన రోడ్లు చెరువులను తలపించాయి. ముఖ్యంగా నిజాంసాగర్ వెళ్లే రహదారి అత్యంత ప్రమాదకరంగా మారింది. విద్యానగర్ కాలనీ నుంచి వచ్చే మురికి నీరు మొత్తం నిజాంసాగర్ చౌరస్తా రహదారిలో నిలిచిపోయింది.
దానితో రహదారిపై ప్రయాణం తీవ్ర ఇబ్బందికరంగా మారిందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదకరమైన ఆరోడ్లపై వెళ్లే వాహనాలు తెరచి ఉన్న మాన్హోల్లు కనపడక నీటిలో మునిగిపోతున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తక్షణమే సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చూడండి: వాయుగుండంగా అల్పపీడనం.. మరో మూడురోజుల పాటు వర్షాలు