ETV Bharat / state

బ్యాంకుల వద్ద పోటెత్తిన ఖాతాదారులు - బ్యాంకుల వద్ద పోటెత్తిన ఖాతాదారులు

ప్రభుత్వాలు అందజేసే నగదు సాయాన్ని తీసుకునేందుకు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్​ కేంద్రంలో బ్యాంకుల వద్ద ప్రజలు పోటెత్తారు. ప్రజల రాకతో బ్యాంకుల వద్ద సందడి కనిపించింది.

బ్యాంకుల వద్ద పోటెత్తిన ఖాతాదారులు
బ్యాంకుల వద్ద పోటెత్తిన ఖాతాదారులు
author img

By

Published : Apr 15, 2020, 4:49 PM IST

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని బ్యాంకుల వద్దకు ఖాతాదారులు అధికసంఖ్యలో వచ్చారు. లాక్​డౌన్​ వేళ రాష్ట్ర ప్రభుత్వం రూ.1500, కేంద్ర ప్రభుత్వం రూ.500 లను ఖాతాల్లో జమ చేస్తోంది. గ్రామపంచాయతీ సిబ్బందికి సీఎం బహుమతి కింద రూ. 5 వేలను తెలంగాణ సర్కార్​ అందిస్తోంది. పెద్దసంఖ్యలో బ్యాంకుల వద్దకు చేరిన ఖాతాదారులను క్యూ పద్ధతిలో కూర్చోబెట్టారు. డీఎస్పీ శశాంక్ రెడ్డి, సీఐ రాజశేఖర్, ఎస్సై కుమార్ రాజాలు పరిస్థితిని పర్యవేక్షించారు. భౌతికదూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. టోకెన్లను ఇస్తూ ఒకరి తర్వాత ఒకరిని లోనికి పంపించారు. ఖాతాదారుల కోసం ఎస్​బీఐ బ్యాంక్ మేనేజర్ ప్రదీప్ తాగునీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు.

ఇవీ చూడండి:రాష్ట్రంలో 644కు చేరిన కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.