కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షానికి రైతులు అమ్మకానికి తెచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడటం వల్ల.. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి, లింగంపేట, నాగిరెడ్డిపేట మండలాల్లో భారీ వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి తెచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయి.. రైతులు నష్టపోయారు.
జిల్లాలోని పలు ప్రాంతాల్లో పంటలు ముందుగా వేయడం వల్ల.. తొందరగానే చేతికొచ్చాయి. అయితే.. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇంకా తెరవకపోవడం వల్ల.. నిల్వ ఉంచిన ధాన్యం కుప్పలు వర్షానికి తడిసి రైతులు నష్టపోయారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని.. వీలైనంత త్వరగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.