కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డిలో నూతనంగా నిర్మించిన రైతు వేదిక భవనాన్ని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రారంభించారు. అనంతరం గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.
చాకలి ఐలమ్మ ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగాలని గంప గోవర్ధన్ సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. బీసీ విద్యార్థుల అభ్యున్నతి కోసం అనేక వసతి గృహాలను ఏర్పాటు చేసి... వారు చదువుకునే విధంగా గురుకులాలను నెలకొల్పామన్నారు. సమాజంలోని వివక్షపైన చాకలి ఐలమ్మ చేసిన పోరాటాన్ని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం ప్రతినిధులు, మండల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగుల భద్రతకు సీఎం హామీ