ETV Bharat / state

మొక్కజొన్న కొనుగోలు చేయాలంటూ సెల్​టవర్​ ఎక్కిన రైతులు - కామారెడ్డి జిల్లాలో సెల్​టవర్​ ఎక్కి రైతుల నిరసన

ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు చేయడం లేదంటూ రైతన్నలు సెల్​టవర్​ ఎక్కి నిరసన తెలియజేశారు. అధికారులు సూచించిన ప్రకారం ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకున్నామని తెలిపారు. అయినా కూడా కొనుగోలు చేయడం లేయకుండా ఇబ్బంది పెడుతున్నారని కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండ రైతులు ఆందోళనకు దిగారు.

farmers-who-climbed-the-cell-tower-to-buy-corn-in-kamareddy-dist
మొక్కజొన్న కొనుగోలు చేయాలంటూ సెల్​టవర్​ ఎక్కిన రైతులు
author img

By

Published : Dec 2, 2020, 5:17 PM IST

కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండ గ్రామంలో మొక్కజొన్న రైతులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం మక్కలు కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందంటూ సెల్​టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం కొనుగోలు చేస్తామంటేనే ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకున్నామని రైతులు వెల్లడించారు. పేర్లు ఆన్​లైన్​లో లేవంటూ మక్కలు కొనుగోలు చేయకుండా అధికారులు ఆలస్యం చేస్తున్నారని వాపోయారు. ధాన్యం కొనుగోలు చేసేవరకు దిగేది లేదని స్పష్టం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

ఇదీ చూడండి:నేనా.. భాజపాలోకా..?: సీపీఐ నారాయణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.