Kamareddy Master Plan Issue Updates: కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డిలో మాస్టర్ ప్లాన్‌పై బాధిత అన్నదాతల ఐకాస సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి 7 విలీన గ్రామాల రైతులు హాజరయ్యారు. మాస్టర్ ప్లాన్‌పై ఎమ్మెల్యే గంప గోవర్ధన్, కలెక్టర్ జితేష్ పాటిల్ ప్రకటనలపై చర్చించారు. ఈ క్రమంలోనే వారు భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. 49 మంది మున్సిపల్ కౌన్సిలర్లకు.. వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు. పార్టీలకు అతీతంగా వినతి పత్రాలు ఇచ్చేందుకు రైతులు నిర్ణయించారు. ఈనెల 10న ఆందోళనకు విరామం ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈనెల 11న మున్సిపాలిటీ వద్ద ధర్నా చేపట్టాలని పేర్కొన్నారు. అదేవిధంగా శాంతియుతంగా ఆందోళనలు చేయాలని.. అన్నదాతలు వివరించారు.
ఇది ఇంకా ముసాయిదాగానే ఉంది: కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా అన్నదాతలు నిరసనలు చేప్టటారు. పారిశ్రామిక ప్రాంతంలో భూములు కలిపారంటూ వారు ఆందోళన బాట పట్టారు. ఈ క్రమంలోనే కలెక్టర్ జితేష్ పాటిల్ మరోసారి వారి సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. బృహత్ ప్రణాళికపై రైతులు అనవసరంగా అపోహ పడుతున్నారని అన్నారు. ఇది ఇంకా ముసాయిదాగానే ఉందని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 1,026 అభ్యంతరాలు వచ్చినట్లు కలెక్టర్ వెల్లడించారు.
రాజకీయ లబ్ధి కోసమే.. కొందరు రైతులను రెచ్చగొడుతున్నారు: కామారెడ్డిలో అన్నదాతల ఆందోళనలపై కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ స్పందించారు. కన్సల్టెన్సీ, డీటీసీపీ చేసిన పొరపాటు వల్లే ఈ గందరగోళం నెలకొందని చెప్పారు. ఏ ఒక్క రైతుకు అన్యాయం చేయమని తెలిపారు. ఒక్క గుంట భూమి కూడా పోదని వివరించారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం బీజేపీ, కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసమే.. కొందరు రైతులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. స్ధానిక పరిస్థితులకు అనుగుణంగా, అందరి ఆమోద యోగ్యంగా ఉండేలా తుది ప్లాన్ ఉంటుందని గంప గోవర్ధన్ వెల్లడించారు.
ఇవీ చదవండి: అబద్ధాలు చెప్పి రైతులను రెచ్చగొడుతున్నారు: గంప గోవర్ధన్
మాస్టర్‌ప్లాన్ రగడ: కోర్టుకెక్కిన కామారెడ్డి రైతులు.. స్పష్టతనిచ్చిన కలెక్టర్
ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. టోల్ ప్లాజా వద్ద ప్రత్యేక లైన్.. అందుకేనా?
హిమాచల్ ప్రదేశ్‌లో క్యాబినెట్ విస్తరణ.. మంత్రులుగా ప్రమాణం చేసిన ఏడుగురు ఎమ్మెల్యేలు