కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం తిప్పాపూర్ గ్రామంలో ఓ రైతు సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. గ్రామానికి చెందిన రైతు ఇల్లెందుల సత్యం.. తన వ్యవసాయ భూమిని ఆక్రమించడానికి సర్పంచ్ స్వామి యత్నిస్తున్నారని ఆరోపించాడు.
ఆయన అనుచరులతో కలిసి దాడి చేశారని వాపోయాడు. తనకు న్యాయం జరిగే వరకు టవర్ దిగేది లేదని చెప్పడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. న్యాయం చేస్తామని పోలీసులు చెప్పడంతో కిందకు దిగాడు.
ఇదీ చదవండి: కరీంనగర్ జిల్లాలో పెరిగిన ఆక్సిజన్ వినియోగం