ETV Bharat / state

'రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయంగా భాజపానే ఉంది' - తెలుగు వార్తలు

రైతులకు మేలు చేసేందుకే కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​ రావు అన్నారు. కొత్త చట్టలతో ప్రధాని మోదీకి పేరు వస్తుందన్న కారణంతోనే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని పేర్కొన్నారు.

'రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయంగా భాజపానే ఉంది'

author img

By

Published : Dec 26, 2020, 4:51 AM IST

రైతుల సంక్షేమం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను గురించి ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​ రావు ఆరోపించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జేపీఎన్ రోడ్డులో ప్రధాని మోదీ ప్రసంగాన్ని ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదటిసారిగా జిల్లాకు వచ్చిన ఆయనకు జిల్లా అధ్యక్షురాలు అరుణ తార స్వాగతం పలికారు. పార్లమెంట్​లో చర్చించిన తర్వాతనే... కేంద్ర ప్రభుత్వం నూతన చట్టాలు తీసుకొచ్చిందని రఘునందన్​రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయంగా భాజపానే ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో భాజపా గెలుపు ఖాయమని... ఆ విధంగానే కృషి చేస్తామని తెలిపారు.

ఇదీ చూడండి: 'సెటిల్ చేసుకున్నా క్రిమినల్ కేసు రద్దు కాదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.